logo

కోడ్‌ ఉల్లంఘిస్తున్నా.. చర్యలు సున్నా

ఉద్యోగులు యథేచ్ఛగా వైకాపా ప్రచారంలో పాల్గొంటున్నా అధికారులకు కన్పించడం లేదు. కోడ్‌ ఉల్లంఘించే వారిపై పరిశీలించి సొంతంగా చర్యలు తీసుకోవడానికి భయపడే పరిస్థితి ఉంది.

Published : 24 Apr 2024 05:07 IST

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: ఉద్యోగులు యథేచ్ఛగా వైకాపా ప్రచారంలో పాల్గొంటున్నా అధికారులకు కన్పించడం లేదు. కోడ్‌ ఉల్లంఘించే వారిపై పరిశీలించి సొంతంగా చర్యలు తీసుకోవడానికి భయపడే పరిస్థితి ఉంది. మంగళవారం 50వ డివిజన్‌లో వైకాపా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి చేపట్టిన ప్రచారంలో నగరపాలకలో పని చేసే పారిశుద్ధ్య కార్మికుడు అనిల్‌ పాల్గొన్నారు.  రెండ్రోజుల ముందు పారిశుద్ధ్య కార్మికురాలు పెద్దక్క వైకాపా కండువా కప్పుకొన్నారు. సోమవారం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నామినేషన్‌ సందర్భంగా వాలంటీర్లు జ్యోతి, పెన్నోబులేశు, రాజు, సాకే భాగ్యశ్రీ, రషీద్‌, మరో మహిళ వైకాపా ప్రచారంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని