logo

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

మండలంలోని పాలసముద్రం, వడిగేపల్లి పంచాయతీల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థి సవిత శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 05 May 2024 03:31 IST

వడిగేపల్లి ప్రచారంలో ప్రసంగిస్తున్న సవిత

గోరంట్ల, న్యూస్‌టుడే: మండలంలోని పాలసముద్రం, వడిగేపల్లి పంచాయతీల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థి సవిత శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా సూపర్‌ సిక్స్‌ పథకాలు అందరికీ అందజేస్తామన్నారు. మేనిఫెస్టో గురించి వివరిస్తూ ప్రచారం సాగింది. మండల కన్వీనర్‌ సోమశేఖర్‌, రెండు పంచాయతీల నాయకులు మనోహర్‌, జయచంద్ర, మూర్తి, సర్పంచి నరసింహమూర్తి, చంద్రశేఖర్‌, హరీశ్‌ తదితరులు పాల్గొన్నారు. చివరిలో దేవులచెరువులో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప పాల్గొన్నారు.
సోమందేపల్లి : సోమందేపల్లి, మాగేచెరువు పంచాయతీ కొత్తపల్లిలో చేనేత నాయకుడు సీసీ హరి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు వెంకటరమణ, సర్పంచి నరసింహులు ప్రచారం చేశారు.
పరిగి : విట్టాపల్లిలో తెదేపా మాజీ జడ్పీటీసీ సూర్యనారాయణ, వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.హనుమయ్య, నాగరాజు, బలరాం, పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
రొళ్ల: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వాతాతలకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేలు పింఛను అందిస్తామని రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి, మడకశిర నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి ఎంఎస్‌ రాజు తెలిపారు. శనివారం రొళ్ల మండలంలోని హులికుంట, గుడ్డుగుర్కి, దొడ్డేరి, కాకి, రత్నగిరి పంచాయతీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత ఎంఎస్‌ రాజు పుట్టిన రోజును ఘనంగా జరుపుకొన్నారు. వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాలతో అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్ర టీఎన్‌టీయూ కార్యదర్శి గురుమూర్తి, వక్కలిగ సాధికార కన్వీనర్‌ పాండురంగప్ప, కన్వీనర్‌ దాసిరెడ్డి, నాయకులు వెంకటరెడ్డి, ఆనంద్‌, పాండురంగప్ప, రాజకుమార్‌, మూర్తి, హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు.

గుడిబండ : మద్దనకుంటలో తెదేపా నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మద్దనకుంటకు చెందిన ఈరక్యాతప్ప, హనుమంతరాయప్ప, ఈరన్న, నాగరాజు తదితరులు వైకాపా నుంచి తెదేపాలో చేరారు.  అగళి : మండలంలోని అగళి, ఎంఎం.పాళ్యం గ్రామాల్లో ఎంఎస్‌ రాజు సతీమణి ఉమాదేవి, జడ్పీటీసీ సభ్యుడు ఉమేశ్‌ తెదేపా తరఫున ప్రచారం చేశారు.

హిందూపురం అర్బన్‌ : ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బీకే పార్థసారథికి ఓట్లు వేసి గెలిపించాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌ మీడియా కోఆర్డినేటర్‌ చంద్రమోహన్‌ యాదవ్‌, బూత్‌ఇన్‌ఛార్జి రామిరెడ్డి, మిథిలేశ్‌, సుధాకర్‌రెడ్డిలు కోరారు. శనివారం పురపాలక సంఘం పరిధిలోని మోతుకపల్లిలో వీరు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం ఇచ్చి పథకాలు తీసుకొచ్చారన్నారు.  

కేక్‌ కోసి రాజుకు తినిపిస్తున్న వక్కలిగ సాధికార కన్వీనర్‌ పాండురంగప్ప

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని