logo

అసత్య ప్రచారం తప్ప వైకాపా చేసిందేమీ లేదు: సునీత

ఐదేళ్ల మీ వైకాపా పాలనలో ఎమ్మెల్యేగా అసత్య ప్రచారాలు తప్ప నువ్వు చేసిందేమిటి ప్రకాశ్‌రెడ్డీ.. అని రాప్తాడు ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని పరిటాల సునీత ప్రశ్నించారు.

Published : 05 May 2024 03:35 IST

పరిటాల సునీత ప్రసంగం వింటున్న ప్రజలు

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: ఐదేళ్ల మీ వైకాపా పాలనలో ఎమ్మెల్యేగా అసత్య ప్రచారాలు తప్ప నువ్వు చేసిందేమిటి ప్రకాశ్‌రెడ్డీ.. అని రాప్తాడు ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని పరిటాల సునీత ప్రశ్నించారు. మండలంలోని పులేటిపల్లి, కోటంపల్లి, పైలబోయలపల్లి, ఓబుళంపల్లి, ప్రసన్నాయపేట, అమిదాలకుంట, కనుముక్కల గ్రామాలలో పరిటాల సునీత ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాలలో తెదేపా శ్రేణులు సునీతకు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారన్నారు. వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయకపోవడంతో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చెప్పుకునేందుకు ఏమీలేక తెదేపా, పరిటాల కుటుంబంపై అభాండాలు వేస్తూ, అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారన్నారు. అధికారంలోకి వస్తే నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామని పలికిన ప్రగల్భాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నావు. మీ సోదరులు చేతుల్లో పెట్టి దందాలతో బెంబేతెత్తితున్నావు. పైకేమో ఏమీ తెలియనట్లు నటిస్తున్నావు. ఏ గ్రామానికి వెళ్లినా తాగునీటి సమస్య ఉందని, రోడ్డు పరిస్థితి ఏమాత్రం బాగాలేదని ప్రజలు సమస్యలను ఏకరవు పెడుతున్నారు. కనీసం తాగునీళ్లివ్వలేని పరిస్థితిలో ఉన్నావంటే నియోజకవర్గ ప్రజలపై నీకెంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.   తెదేపా సీనియర్‌ నాయకుడు ఎల్‌ నారాయణచౌదరి, మండల కన్వీనర్‌ ముత్యాలరెడ్డి, పార్టీ జిల్లి ఉపాధ్యక్షుడు ఒబిలేశు, తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి రామసుబ్బమ్మ, మాజీ ఎంపీపీలు అమరేంద్ర, ప్రసాదమ్మ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని