logo

క్యూలైన్లలో అస్వస్థతకు గురై భక్తుడి మృతి

బోయకొండ గంగమ్మ దర్శనానికి వచ్చి ఓ భక్తుడు క్యూలైనులో అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

Updated : 06 May 2024 06:55 IST

అత్యవసర ద్వారం, అంబులెన్స్‌ లేక ఇబ్బంది

మల్లికార్జున రెడ్డి  (పాతచిత్రం)

బోయకొండ (చౌడేపల్లె), న్యూస్‌టుడే: బోయకొండ గంగమ్మ దర్శనానికి వచ్చి ఓ భక్తుడు క్యూలైనులో అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పుంగనూరు మండలం ఏటవాకిలి చెందిన మల్లికార్జునరెడ్డి (46) ఆదివారం అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి బంధువులతో కలిసి వచ్చారు. రూ.50 టిక్కెట్టు తీసుకుని క్యూలైన్లో ప్రవేశించారు. కొంత దూరం వెళ్లిన తర్వాత తీవ్ర అస్వస్థతతో అక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చేందుకు అత్యవసర ద్వారం లేకపోవడంతో భక్తుల బయటి రప్పించి అతన్ని తీసుకువచ్చారు. దీంతో ఆలస్యమైంది. కొండ కింద పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అందించి మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు మృతుని కుటుంబీకులు పేర్కొన్నారు.

ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం..

అస్వస్థతకు గురైన వ్యక్తిని ఆలయ సిబ్బంది పట్టించుకోలేదని మృతుని కుటుంబీకులు ఆరోపించారు. అత్యవసర ద్వారం లేకపోవడంతో బయటకు తెచ్చేందుకు ఆలస్యమైందని సకాలంలో వైద్యం అందేదని తెలిపారు. అంబులెన్స్‌ కూడా లేకపోవడంతో ఆసుపత్రికి తరలిచడంలో తీవ్ర జాప్యమైందన్నారు. సకాలంలో వైద్యం అంది ఉంటే ప్రాణాలు దక్కేవని ఆవేదన చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని