logo

ముస్లింలకు ప్రత్యేక వ్యాక్సినేషన్‌

హజ్‌ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులకు ప్రత్యేక వ్యాక్సినేషన్‌ అందిస్తున్నామని.. ఈ యాత్రకు వెళ్లే ప్రతిఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని డీఎంహెచ్‌వో ప్రభావతిదేవి తెలిపారు.

Published : 07 May 2024 02:53 IST

వ్యాక్సిన్‌ వేస్తున్న డీఎంహెచ్‌వో ప్రభావతిదేవి

చిత్తూరు(వైద్యవిభాగం), న్యూస్‌టుడే: హజ్‌ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులకు ప్రత్యేక వ్యాక్సినేషన్‌ అందిస్తున్నామని.. ఈ యాత్రకు వెళ్లే ప్రతిఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని డీఎంహెచ్‌వో ప్రభావతిదేవి తెలిపారు. చిత్తూరు నగరంలోని టెలిఫోన్‌కాలనీ అర్బన్‌ ఆరోగ్య కేంద్రంలో సోమవారం ముస్లింలకు వ్యాక్సిన్‌ వేశారు. ఆమె మాట్లాడుతూ వ్యాక్సిన్‌ వేసుకున్నట్లు ధ్రువపత్రం లేనిదే యాత్రకు అనుమతిం చరని, దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నారు. 65 ఏళ్లు పైబడిన వారికి ఇన్ల్ఫూయంజా, మెనిమ్‌ జైటీస్‌, పోలియో టీకా, 65 సంవత్సరాల లోబడి ఉన్నవారికి మెనిమ్‌ జైటీస్‌, పోలియో వ్యాక్సిన్లు వేస్తారన్నారు. ఈ వ్యాక్సిన్లు ఊపిరితిత్తులు, మెదడు, పోలియో వ్యాధి రాకుండా కాపాడుతుందని, ఎవరూ నిర్లక్ష్యం చేయరాదని తెలిపారు. ఏడో తేదీన వి.కోట ప్రభుత్వాసుపత్రి, 8న తూర్పు మొగసాల అర్బన్‌ ఆరోగ్య కేంద్రం(పుంగనూరు)లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. హజ్‌యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా టీకాల అధికారి రవిరాజు, మత పెద్దలు ఎలియాజ్‌, ఉబేడ్‌షరీఫ్‌, వైద్యులు వినోద్‌ప్రభు, రెడ్డప్ప పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని