logo

గండం తప్పినట్లేనా..?

 జవాద్‌ తుపాను ఒడిశా వైపు కదలడంతో జిల్లాకు ప్రమాదం ఉండదని అంచనా వేస్తున్నారు. శనివారం ఎలాంటి ప్రభావం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. నీ కాకినాడ-ఉప్పాడ బీచ్‌రోడ్డు వెంట సముద్ర అలలు రహదారిపైకి వచ్చాయి. తీరంలో సముద్రం అలజడిగా ఉంది. తుపాను హెచ్చరికలు

Published : 05 Dec 2021 06:26 IST


కెరటాల ధాటికి ధ్వంసమైన ఉప్పాడ-కాకినాడ బీచ్‌ రోడ్డు

కాకినాడ కలెక్టరేట్, రాజమహేంద్రవరం నగరం, యు.కొత్తపల్లి:  జవాద్‌ తుపాను ఒడిశా వైపు కదలడంతో జిల్లాకు ప్రమాదం ఉండదని అంచనా వేస్తున్నారు. శనివారం ఎలాంటి ప్రభావం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. నీ కాకినాడ-ఉప్పాడ బీచ్‌రోడ్డు వెంట సముద్ర అలలు రహదారిపైకి వచ్చాయి. తీరంలో సముద్రం అలజడిగా ఉంది. తుపాను హెచ్చరికలు ఉపసంహరించ లేదని,  అప్రమత్తత కొనసాగుతుందని డీఆర్వో సత్తిబాబు తెలిపారు. తుపాను వీడే వరకు వరి కోతలు కోయవద్దని వ్యవసాయశాఖ తెలిపింది. ్య హౌరా-విజయవాడ మార్గంలో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. వివరాలు తెలిపేందుకు రాజమహేంద్రవరం రైల్వేస్టేషనులో సహాయ కేంద్రాన్ని (0883-2420541) ఏర్పాటు చేశారు. ్య  జిల్లా మీదుగా రాకపోకలు సాగించే రైళ్లను ఇప్పటికే తాత్కాలికంగా రద్దు చేయగా.. ఈ  రద్దును మళ్లీ పొడిగించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని