logo

డ్రైవర్లు, క్లీనర్ల సమస్యలు పరిష్కరించాలి

ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల లారీ డ్రైవర్లు, క్లీనర్లు సమస్యలను వెంటనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని తెలుగు రాష్ట్రాల లారీ డ్రైవర్లు, కీనర్లు వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఏలేటి వాసు విజ్ఞప్తి చేశారు. కాకినాడ గ్రామీణం

Published : 21 Jan 2022 04:42 IST


మాట్లాడుతున్న వ్యవస్థాపక అధ్యక్షుడు ఏలేటి వాసు

 

సర్పవరం జంక్షన్‌: ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల లారీ డ్రైవర్లు, క్లీనర్లు సమస్యలను వెంటనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని తెలుగు రాష్ట్రాల లారీ డ్రైవర్లు, కీనర్లు వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఏలేటి వాసు విజ్ఞప్తి చేశారు. కాకినాడ గ్రామీణం తిమ్మాపురంలో గురువారం జరిగిన రెండు రాష్ట్రాల కమిటీ ప్రతినిధుల ఐక్య సమావేశంలో ఆయన మాట్లాడారు. లారీ డ్రైవర్లకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలని, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఆధారంగా రూ.10 లక్షలు బీమా, హెల్త్‌ కార్డుల సౌకర్యం కల్పించాలన్నారు. తాతారావు, కిశోర్‌, ప్రతినిధులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని