logo

ముగిసిన నామినేషన్ల ఘట్టం

జిల్లాలో కాకినాడ పార్లమెంట్‌, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది.

Published : 26 Apr 2024 06:01 IST

కలెక్టర్‌, రిటర్నింగ్‌ అధికారి నివాస్‌కు నామపత్రం అందజేస్తున్న వైకాపా అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో కాకినాడ పార్లమెంట్‌, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఈ నెల 18 నుంచి 25 వరకు కాకినాడ పార్లమెంట్‌కు కలెక్టరేట్‌, ఏడు అసెంబ్లీ నియోజకవర్గ  కేంద్రాల్లో నామపత్రాలను స్వీకరించారు. ఆఖరి రోజు గురువారం పార్లమెంట్‌తోపాటు అసెంబ్లీ నియోజకవర్గాలకు పెద్ద సంఖ్యలో నామపత్రాలు దాఖలయ్యాయి. శుక్రవారం ఆయా రిటర్నింగ్‌ అధికారులు కార్యాలయాల్లో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించనున్నారు. శనివారం, సోమవారం ఆయా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాల్లో నామపత్రాల ఉపసంహరణకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల్లోపు అవకాశం కల్పించారు. ఈ నెల 29 మధ్యాహ్నం 3 గంటల తర్వాత కాకినాడ పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ నియోకవర్గాల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాలను రిటర్నింగ్‌ అధికారులు ప్రకటించనున్నారు.

పెద్ద సంఖ్యలో నామినేషన్లు..

ఈసారి ఎన్నికల్లో పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలకు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా నామినేషన్లు వేశారు. కాకినాడ పార్లమెంట్‌ స్థానానికి 32 దాఖలు అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు