logo

నిలిచేదెవరో.. గెలిచేదెవరో?

రాజమహేంద్రవరం కలెక్టరేట్‌: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది.

Published : 26 Apr 2024 06:23 IST

రాజమహేంద్రవరం కలెక్టరేట్‌: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. వీటి పరిశీలన, ఉపసంహరణ అనంతరం ఈ నెల 29న సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచేదెవరో.. వైదొలిగేదెవరనేది తేలనుంది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా గురువారం చివరిరోజు నాటికి మొత్తం 205 సెట్ల నామపత్రాలు దాఖలయ్యాయి. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గానికి మొత్తం 24 సెట్లు దాఖలు చేయగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 181 వరకు సమర్పించారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అత్యధికంగా రాజానగరంలో 31 నామపత్రాలు దాఖలు కాగా నిడదవోలులో 30, అనపర్తిలో 29, కొవ్వూరులో 28, రాజమహేంద్రవరం గ్రామీణంలో 23, గోపాలపురంలో 20, రాజమహేంద్రవరం అర్బన్‌లో 20 చొప్పున దాఖలయ్యాయి.

ఆఖరి రోజు.. అదేజోరు.. 

జిల్లాలో నామినేషన్ల స్వీకరణ చివరి రోజైన గురువారం మొత్తం 69 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గానికి ఏడు దాఖలుకాగా జిల్లాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి 62 దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత తెలిపారు.

 పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి స్వతంత్ర అభ్యర్థులుగా కొల్లపు వేణు, జల్లి బాలనవీన, గొలుగూరి వెంకటలక్ష్మీనారాయణరెడ్డి, ఆల్‌ఇండియా పార్వర్డ్‌బ్యాక్‌ పార్టీ తరఫున చేబ్రోలు చైతన్య, రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థిగా వారా ప్రభాకర్‌, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరఫున పులగం విజయభాస్కరలక్ష్మి, యుగతులసి పార్టీ నుంచి కోటగిరి శ్రీనివాసరావు నామనేషన్లు దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని