logo

స్కానింగ్‌ కేంద్రాలపై నిఘా

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, స్కానింగ్‌ కేంద్రాలపై నిఘా పెట్టాలని కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ ఆదేశించారు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో ఈ చట్టానికి సంబంధించిన వివిధ శాఖల అధికారులతో ఆ

Published : 23 Jan 2022 02:59 IST


సమీక్షిస్తున్న ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ

 

బాలాజీచెరువు: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, స్కానింగ్‌ కేంద్రాలపై నిఘా పెట్టాలని కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ ఆదేశించారు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో ఈ చట్టానికి సంబంధించిన వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. భ్రూణ హత్యలను నివారించడానికి పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. ఆల్ట్రాసౌండ్‌ వైద్య పరీక్షలు లింగ నిర్థారణకు వినియోగించడం నేరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాకినాడ డివిజన్‌ స్థాయిలో గుర్తింపు పొందిన 92 స్కానింగ్‌ కేంద్రాలపై డెకాయ్‌ ఆపరేషన్లు, తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. నాలుగు స్కానింగ్‌ కేంద్రాలు పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోగా, వాటిని ఆమోదించారు. ఈ సమావేశంలో డీఐవో డాక్టర్‌ సీహెచ్‌వీ భరతలక్ష్మి, డాక్టర్‌ బీబీ మోమినా, కె.సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని