logo

బ్లాక్‌ స్పాట్లలో ప్రమాదాల నివారణకు చర్యలు

జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై  శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశం జరిగింది.

Published : 01 Oct 2022 05:20 IST


సమావేశంలో చర్చిస్తున్న కలెక్టర్‌, ఆయా శాఖల అధికారులు

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై  శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో అత్యంత ప్రమాదకరమైన బ్లాక్‌ స్పాట్లు 15 ఉన్నట్లు గుర్తించామని, ఇక్కడ ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. 

ప్రమాద సమాచారమందిస్తే రూ.5 వేల పారితోషికం
ప్రమాదం జరిగిన తొలి అరగంట ఎంతో కీలకమని, ఆ సమయంలో క్షతగాత్రులకు ప్రథమచికిత్స అందించడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని కలెక్టర్‌ అన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఆ సమాచారాన్ని అందించే వారికి ప్రభుత్వపరంగా రూ.5 వేల పారితోషికం అందిస్తామన్నారు. దివాన్‌చెరువు-కొవ్వూరు మధ్య గామన్‌ వంతెన రహదారి, రాజానగరం-కాకినాడ ఏడీబీ రోడ్డు పనులపై చర్చించారు. జిల్లాలో ఈ ఏడాది ఆగస్టు వరకు 622 రోడ్డు ప్రమాదాలు జరిగాయని అధికారులు వివరించారు. 

కలెక్టరేట్లలో విద్యుత్తు వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్లు
కాకినాడ కలెక్టరేట్‌: కాకినాడ, రాజమహేంద్రవరం కలెక్టరేట్లలో ఎలక్ట్రికల్‌ వెహికల్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఒక్కోచోట రూ.30 లక్షలతో వీటిని నెలకొల్పనున్నారు. ఈ మేరకు కాకినాడ నుంచి నెడ్‌క్యాప్‌ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఎలక్ట్రికల్‌ ద్విచక్ర వాహనాలను ఒక్కోటి రూ.75 వేల నుంచి రూ.1.75 లక్షల వరకు విక్రయించనున్నారు. 12 రకాల ద్విచక్ర వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. కాకినాడ, రాజమహేంద్రవరంలోని నెడ్‌క్యాప్‌ కార్యాలయాల్లో ఈ వాహనాలకు సంప్రదించాలని నెడ్‌క్యాప్‌ కాకినాడ జిల్లా మేనేజరు జి.సత్యనారాయణ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని