logo

భావనారాయణస్వామి ఆవిర్భావోత్సవం

కాకినాడ గ్రామీణం సర్పవరం గ్రామంలోని రాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి ఆలయంలో మాఘమాసం మూడో ఆదివారం తిరునాళ్ళు, స్వామి వారి ఆవిర్భావ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

Published : 06 Feb 2023 05:11 IST

పుష్పాలంకరణలో స్వామివారు

సర్పవరం జంక్షన్‌: కాకినాడ గ్రామీణం సర్పవరం గ్రామంలోని రాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి ఆలయంలో మాఘమాసం మూడో ఆదివారం తిరునాళ్ళు, స్వామి వారి ఆవిర్భావ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు నారద కోనేరులో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఆవు పేడ పిడకలపై స్వామి వారికి ప్రసాదం తయారు చేసి సమర్పించారు. రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కుటుంబ సభ్యులు, సినీ దర్శకుడు కురసాల కల్యాణ్‌కృష్ణ తదితరులు స్వామి వారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈవో విజయలక్ష్మి, ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ పుల్ల నారాయయణరావు తదితరులు పాల్గొన్నారు.

చీర కొంగులతో ప్రసాదం స్వీకరిస్తున్న భక్తులు

శ్రీనివాస కల్యాణం నృత్యరూపకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని