చర్మ సౌందర్యానికి ఎండ దెబ్బ!
వేసవిలో శరీరం నుంచి చెమట ఎక్కువ వస్తుంది. శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యం చేయడానికి చర్మం చల్లబడుతుంది.
* వేసవిలో శరీరం నుంచి చెమట ఎక్కువ వస్తుంది. శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యం చేయడానికి చర్మం చల్లబడుతుంది. అయితే పార్కిన్సన్స్, మానసిక వ్యాధులకు వాడే కొన్ని రకాల మందుల వల్ల కొందరిలో చెమట పట్టదు. దీంతో శరీర ఉష్ణోగ్రతలు పెరగడమే కాదు.. చర్మ సౌందర్యానికీ ఇబ్బందే. ఇలాంటి వారు వైద్యులను సంప్రదించి మందులు మార్చుకోవాలి.
* వేసవిలో చాలామందికి చెమట కాయలు వస్తాయి. దుస్తులు బిగుతుగా ఉంటే మరింత ఇబ్బంది. ఈ కాలంలో వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం ఉత్తమం.
* చర్మంపై నేరుగా సూర్యరశ్మి పడకుండా శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు ధరించాలి.
* గంటల తరబడి ఎండలో తిరగడం వల్ల కూడా చర్మం తన సహజ కాంతిని కోల్పోతుంది. కమిలిపోయి బొబ్బలు వచ్చే ప్రమాదం ఉంది.
* చెమట శరీరంపై పేరుకుపోయి శుభ్రం చేయకుండా విడిచి పెడితే అవి బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లకు దారి తీస్తాయి. అందుకే రెండు పూటలా చల్లని నీటితో స్నానం చేయాలి.
* బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు కన్పిస్తే నిర్లక్ష్యం చేయకుండా చర్మ వ్యాధి నిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
* ఎండ నుంచి కాపాడుకోవడానికి ప్రస్తుతం ఎన్నో రకాల లేపనాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
* బయటకు వెళ్లినప్పుడు చలువ అద్దాలు, టోపీ, మాస్క్ ధరించడం వల్ల ముఖంపై ఎండ పడకుండా చూసుకోవచ్చు.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!
-
Tamannaah: అలాంటి సీన్స్‌లో నటించడం మానేశా: దక్షిణాది చిత్రాలపై తమన్నా వ్యాఖ్యలు
-
stuntman sri badri: ‘భోళా శంకర్’ మూవీ పారితోషికాన్ని విరాళంగా ఇచ్చిన స్టంట్‌మ్యాన్ శ్రీబద్రి
-
Hyderabad: చింతల్‌బస్తీ నాలాలో మొసలి పిల్ల.. భయాందోళనలో స్థానికులు
-
Guntur: తెదేపా మహిళా నేత అరెస్టు.. పోలీసుల తీరును తప్పుబట్టిన న్యాయమూర్తి