logo

సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ ప్రక్రియ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది సమస్యాత్మక కేంద్రాలే. పోలింగ్‌ ముగిసే వరకు  అధికారుల దృష్టంతా వాటిపైనే ఉంటుంది.

Published : 19 Apr 2024 04:55 IST

బందోబస్తుపై అధికారుల కసరత్తు

సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కవాతు (పాత చిత్రం)

దానవాయిపేట(రాజమహేంద్రవరం): సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ ప్రక్రియ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది సమస్యాత్మక కేంద్రాలే. పోలింగ్‌ ముగిసే వరకు  అధికారుల దృష్టంతా వాటిపైనే ఉంటుంది. ఇప్పటికే వీటిపై విశ్లేషణ పూర్తయింది. ప్రతి కేంద్రంలోని క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగం, గతంలో ఆయా కేంద్రాల వద్ద చోటు చేసుకున్న ఘటనలు, గొడవలు వంటి వాటి ఆధారంగా పోలీస్‌, రెవెన్యూ, నగరపాలక, పురపాలక, పంచాయతీ శాఖల అధికారులు నివేదికలు రూపొందించారు.

ఎలా గుర్తిస్తారు?

ఒక కేంద్రంలో 90 శాతం కంటే ఎక్కువ పోలింగ్‌ నమోదు కావడం గాని.. ఒక అభ్యర్థికి 75 శాతం ఓట్లు రావడం గాని.. ఒకే ఆవరణలో నాలుగు.. అంతకంటే ఎక్కువ కేంద్రాలు ఉన్నాగాని.. వాటిని సమస్యాత్మకమైనవిగా పరిగణిస్తారు. ఇదే క్రమంలో ఘర్షణలు, నేర సంబంధిత అంశాలు చోటు చేసుకున్న ప్రదేశాల్లోని కేంద్రాలను కూడా సమస్యాత్మకమైనవిగా భావిస్తారు. ఈ ఎన్నికలకు సంబంధించి రాజమహేంద్రవరం అర్బన్‌లోని 231 పోలింగ్‌ కేంద్రాలకు గాను 46 కేంద్రాల్ని జిల్లా అధికారులు గుర్తించారు.

సవ్యంగా సాగేనా...?

సమస్యాత్మక కేంద్రాల్లో ఎన్నికలు సవ్యంగా సాగాలంటే అన్ని విభాగాల అధికారులు సమగ్ర అధ్యయనం చేసి సమన్వయంతో ఆయా ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ జరిగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేయాల్సి అవసరం ఉంది. కేంద్రాల పరిశీలన, అక్కడ కల్పించాల్సిన వసతులు, క్షేత్రస్థాయి విశ్లేషణ, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాలి. ప్రజలు ప్రశాంతంగా వారి ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారన్నది వేచి చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని