logo

అగ్ని ప్రమాదంలో రూ.4 లక్షల ఆస్తినష్టం

నగరం మండలం బోరమాదిగపల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. కారుమూరి క్రాంతికుమార్‌కు చెందిన రెండు పూరిళ్లు కాలి బూడిదయ్యాయి. డ్వాక్రా రుణం చెల్లించేందుకు సభ్యులిచ్చిన రూ.50 వేల నగదుతో పాటు సుమారు రూ.లక్ష విలువ

Published : 25 Jan 2022 01:40 IST


మంటల్లో కాలిపోతున్న పూరిళ్లు

నగరం : నగరం మండలం బోరమాదిగపల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. కారుమూరి క్రాంతికుమార్‌కు చెందిన రెండు పూరిళ్లు కాలి బూడిదయ్యాయి. డ్వాక్రా రుణం చెల్లించేందుకు సభ్యులిచ్చిన రూ.50 వేల నగదుతో పాటు సుమారు రూ.లక్ష విలువ చేసే బంగారపు వస్తువులు, మరో రూ.లక్ష విలువ చేసే ఎలక్ట్రికల్‌ వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. పొలం పనులకు వెళ్లారు. కట్టుబట్టలతో మిగిలామని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. రేపల్లె అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ కారణమై ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.
బాపట్ల పరిధిలో మరో ఇల్లు..
బాపట్ల, న్యూస్‌టుడే : బాపట్ల మండలం పడమర బాపట్ల పంచాయతీ వైఎస్‌ నగర్‌లో ఆసోది వెంకటేశ్వరరెడ్డికి చెందిన పూరిల్లు సోమవారం సాయంత్రం సంభవించిన అగ్నిప్రమాదంలో కాలిపోయింది. వంట గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించినట్లు బాధితుడు తెలిపాడు. రూ.50 వేల నగదు కాలిపోయిందని, మరో రూ.యాభై వేల ఆస్తి నష్టం జరిగినట్లు పేర్కొన్నాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని