logo

మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం

రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు.

Published : 26 Apr 2024 05:44 IST

పెదకాకాని, ఆటోనగర్‌, పట్టాభిపురం, న్యూస్‌టుడే : రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. గుంటూరు ఆటోనగర్‌లో గురువారం ఓల్డ్‌ మోటార్‌ యూనియన్‌ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్‌ అహ్మద్‌ అధ్యక్షత వహించగా పెమ్మసాని ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పేదల అభ్యున్నతి, జిల్లా అభివృద్ధి చేసేందుకు వచ్చిన తనను, నసీర్‌ అహ్మద్‌ని రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభాని మాట్లాడుతూ తెదేపాతోనే గుంటూరు తూర్పు అసెంబ్లీ సీటు మైనార్టీలకు వచ్చినట్లు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో మైనార్టీల రిజర్వేషన్లు పోతాయని వైకాపా చేస్తున్న అసత్య ఆరోపణలను నమ్మవద్దన్నారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ మాట్లాడుతూ పదేళ్ల కాలం పాటు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఆటోనగర్‌ అభివృద్ధిని గాలికొదిలేశారని మండిపడ్డారు. తెదేపా నేతలు భరత్‌రెడ్డి, షబ్బీర్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ గౌస్‌, ఉగ్గిరాల సీతారామయ్య పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని