logo

మెగా కాదు.. దగా డీఎస్సీ

తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Published : 26 Apr 2024 05:32 IST

తుళ్లూరు, దుగ్గిరాల, న్యూస్‌టుడే : తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందాలని ఏళ్ల తరబడి శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ఆశలపై సీఎం జగన్‌ నీళ్లు పోశాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి ఉద్యోగాలిస్తామని 2019లో జగన్‌ హామీనిచ్చారు. రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల వేళ అరకొర పోస్టులతో డీఎస్సీ-2024 ప్రకటన చేసి మోసం చేశారని అభ్యర్థులు విమర్శిస్తున్నారు. అమలు చేయనప్పుడు హామీలు ఇవ్వటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.


అయిదేళ్ల శ్రమ వృథా

- శానం వెంకటేశ్వరరావు, బీఏ, బీఈడీ, అనంతవరం

వైకాపా ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. ఎన్నికల ముందు అరకొర పోస్టులతో దగా రాజకీయ లబ్ధి కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. తీరా చూస్తే పరీక్షలు రద్దయ్యాయి. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం అయిదేళ్లుగా శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు సమయం వృథా అయింది.


ఎదురు చూపులే మిగిలాయి

 -నన్నెపాగ ప్రభాకర్‌, దుగ్గిరాల

డీఎస్సీ కోసం అయిదేళ్లుగా ఎదురుచూస్తున్నాం. ఇటీవల వేసినా తగినన్ని ఖాళీలు లేవు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒక పక్క చాలా మందికి నిర్ణీత వయసు దాటిపోతోంది.


జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ

- జొన్నకూటి ఏడుకొండలు, ఎం.కామ్‌, బీఈడీ, - వడ్డమాను

ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి ఉద్యోగాలు ఇస్తామని జగన్‌ ఎన్నికల ముందు హామీలు ఇవ్వటం సమంజసం కాదు. అధికారంలోకి రాగానే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎన్నికల ముందు ఊదర గొట్టారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉపాధ్యాయ విద్యార్థుల ఆశలను ఆడియాశలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని