logo

మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం

పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ పేర్కొన్నారు

Published : 28 Mar 2024 06:24 IST

పొన్నూరు, న్యూస్‌టుడే: పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని 7వ వార్డు, మండలంలోని సూపూడి, మన్నవ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడ్కో గృహాలను కొంత మంది లబ్ధిదారులకు తెదేపా ప్రభుత్వ హయాంలోనే కేటాయించినా..వారికి వైకాపా పాలనలో ఇళ్లు అప్పగించలేదన్నారు. తెదేపా, జనసేన కూటమి అధికారంలోకి రాగానే లబ్ధిదారులకు గృహాలు కేటాయిస్తామన్నారు. మన్నవ గ్రామంలో చివర భూములకు సాగునీరు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, దీనిని తొలగించేందుకు ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించి దాదాపుగా పనులు పూర్తి చేశామని చెప్పారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగిలిన పనులు పూర్తి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని