logo

పాలకా.. ఇది తగునా?

పొన్నూరు పురపాలక సంఘంలో ఎన్నికల కోడ్‌ సరిగా అమలు కావడం లేదు. అధికార పార్టీకి ఒక లాగా... ప్రతిపక్ష పార్టీకి మరోలా అమలు చేస్తూ అధికారులు వివక్ష చూపుతున్నారు.

Published : 29 Mar 2024 04:30 IST

నిడుబ్రోలు, న్యూస్‌టుడే: పొన్నూరు పురపాలక సంఘంలో ఎన్నికల కోడ్‌ సరిగా అమలు కావడం లేదు. అధికార పార్టీకి ఒక లాగా... ప్రతిపక్ష పార్టీకి మరోలా అమలు చేస్తూ అధికారులు వివక్ష చూపుతున్నారు. గతంలో పొన్నూరు పట్టణం జీబీసీ రహదారిలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత దానిపై ముసుగు వేయలేదు. పొన్నూరు పురపాలక సంఘం 50 వసంతాలు పూర్తి చేసినందుకు అప్పటి తెదేపా మంత్రులు కార్యాలయ ఆవరణలో పైలాన్‌ అవిష్కరించారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో పురపాలక సంఘ అధికారులు పైలాన్‌ చుట్టూ ముసుగులు వేశారు. ఒకదానికి వర్తించిన నిబంధనలు రెండో దానికి వర్తించకపోవడం ఏమిటని ప్రజలు ఎన్నికల అధికారులను ప్రశ్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని