logo
Published : 02/12/2021 03:01 IST

ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలి యువకుడి మృతి

సోహెల్‌

మేడిపల్లి(బోడుప్పల్‌), న్యూస్‌టుడే: కారుకు పెయింటింగ్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలి యువకుడు మృతి చెందిన ఘటన మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి ఠాణా పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ రామకృష్ణానగర్‌కు చెందిన మహ్మద్‌ సోహెల్‌(25) మేడిపల్లిలోని శ్రీనివాస మోటార్స్‌లో ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి కారుకు పెయింటింగ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆక్సిజన్‌ సిలిండర్‌ వేడెక్కి పేలిపోయింది. యువకుడి తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. సహచరులు ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. 

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని