CM KCR: తెలంగాణలో భూసమస్యల పరిష్కారానికి మండలాల్లో రెవెన్యూ సదస్సులు

తెలంగాణలో మిగిలిన భూ సమస్యల పరిష్కారానికి మండలాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ నెల...

Updated : 05 Jul 2022 21:26 IST

హైదరాబాద్‌: తెలంగాణలో మిగిలిన భూసమస్యల పరిష్కారానికి మండలాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ నెల 15 నుంచి సదస్సులు నిర్వహించాలని వెల్లడించారు. 3 రోజులకు ఒక మండలం చొప్పున మొత్తం 100 బృందాలను ఏర్పాటు చేసి సదస్సులు నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. జాయింట్ కలెక్టర్, డీఆర్‌వో, ఆర్డీవోల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో ఈ సదస్సులు నిర్వహించాలని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల నిర్వహణపై ప్రగతిభవన్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ మంగళవారం సమీక్ష చేపట్టారు. భూరికార్డుల సమస్యల పరిష్కారంపై సమావేశంలో చర్చించారు.

రెవెన్యూ సదస్సు నిర్వహణకు సంబంధించి అవగాహన కార్యక్రమం ఈ నెల 11న ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ఈ అవగాహన సదస్సుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు హాజరు కానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని