logo

‘హత్యలు, అత్యాచారాల నిరోధంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం’

రాష్ట్రంలో మహిళలు, యువతులు, బాలికలు, దళిత, గిరిజనుల హత్యలు, అత్యాచారాలను అరికట్టడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి విమర్శించారు. తాము చేసిన పోరాటాల

Updated : 12 Aug 2022 05:37 IST

కాచిగూడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మహిళలు, యువతులు, బాలికలు, దళిత, గిరిజనుల హత్యలు, అత్యాచారాలను అరికట్టడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి విమర్శించారు. తాము చేసిన పోరాటాల ఫలితంగానే తెలంగాణ మహిళా కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. గురువారం కాచిగూడ చప్పల్‌బజార్‌ మహేంద్రగార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమంలో భాజపా మహిళా మోర్చా రెండేళ్లలో చేపట్టిన కార్యక్రమాలపై  పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. ప్రధాన కార్యదర్శి కల్యాణం గీతారాణి, ఉపాధ్యక్షురాలు డాక్టర్‌ మాలతి, మీనాక్షి గిరిధారి, వీణారెడ్డి, ఆరతి, పరమేశ్‌, భీమ్‌సేన్‌ మూర్తి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని