logo

డిజిటల్ లావాదేవీలపై ఖాతాదారులకు అవగాహన

ఏటీఎం కార్డు లేకుండానే ఆర్థిక పరమైన లావాదేవీల నిర్వహణ, డిజిటల్ బ్యాంకింగ్ పై ఖాతాదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఈసీఐఎల్ ఎస్బీఐ ఛీఫ్ మేనేజర్ కె.రాంబాబు పేర్కొన్నారు.

Published : 27 Mar 2024 21:25 IST

కాప్రా: ఏటీఎం కార్డు లేకుండానే ఆర్థిక పరమైన లావాదేవీల నిర్వహణ, డిజిటల్ బ్యాంకింగ్ పై ఖాతాదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఈసీఐఎల్ ఎస్బీఐ ఛీఫ్ మేనేజర్ కె.రాంబాబు పేర్కొన్నారు. బుధవారం ఈసీఐఎల్‌లోని బ్యాంకు శాఖలో మూడు (తేదీలు 27, 28, 29) రోజుల పాటు 'యోనోయాప్ బిజినెస్'పై నిర్వహిస్తున్న అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ బీఐ యోనో యాప్ ద్వారా ఏటీయం ఎబిట్ కార్డులు లేకుండా చరవాణిలోనే సులువుగా అన్ని రకాలైన ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ బ్యాంకింగ్ నిర్వహణ అంశాలపై నిపుణులు ఖాతాదారులకు అవకాహన కల్పించారు. ఛీఫ్ మేనేజర్ మాట్లాడుతూ.. డిజిటల్ లావాదేవీల నిర్వహణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డీబీఎం రేణక, డిజిటల్ బ్యాంకింగ్ ఇంఛార్జీ బండా నాగేందర్‌వాసుకి, నాగార్జున, లక్ష్మీప్రసన్న, కిషోర్, సాయికృష్ణ, అర్చనలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని