logo

టీఎస్‌ ఈఏపీసెట్‌ సెంటర్లు పెంచే యోచన: జేఎన్‌టీయూ

టీఎస్‌ ఈఏపీసెట్‌-24 పరీక్షా కేంద్రాలను పెంచే యోచనలో జేఎన్‌టీయూ అధికారులు ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇంజినీరింగ్‌కు 1,93,468 దరఖాస్తులు రాగా..

Published : 28 Mar 2024 02:55 IST

కూకట్‌పల్లి, న్యూస్‌టుడే: టీఎస్‌ ఈఏపీసెట్‌-24 పరీక్షా కేంద్రాలను పెంచే యోచనలో జేఎన్‌టీయూ అధికారులు ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇంజినీరింగ్‌కు 1,93,468 దరఖాస్తులు రాగా.. అగ్రికల్చర్‌, ఫార్మసీలో 71,999మంది దరఖాస్తు చేశారు. రెండు విభాగాల్లో కలిపి మొత్తం ఇప్పటికే 2,66,121మంది దరఖాస్తు చేశారు. ఇంకా దరఖాస్తు గడువుకు 9రోజుల సమయం ఉంది.  వచ్చిన దరఖాస్తుల్లో ఇంజినీరింగ్‌లో తెలంగాణ నుంచి 1,63,748, ఏపీ నుంచి 29,720మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఈసారి ఈఏపీసెట్‌ పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశాలను దృష్టిలో పెట్టుకొని  రెండు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన 208పరీక్షా కేంద్రాలకు అదనంగా మరిన్ని పెంచాలని సమాలోచనలు చేస్తున్నట్లు సెట్‌ కో-కన్వీనర్‌ డాక్టర్‌ కె.విజయ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌ నగరం, ఏపీలో కొన్ని కేంద్రాలు పెంచాలని నిర్ణయించినట్లు వివరించారు. దీనిపై ఒకటి, రెండురోజుల్లో  తుది నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని