logo

నైపుణ్యం ఉంటే.. కొలువు వెంటే

ఇంజినీర్లు, పట్టభద్రులు ఉద్యోగావకాశాల కోసం వెదుకుతుంటే.. మరో వైపు ప్రతిభావంతులైన నిపుణుల కోసం కార్పొరేట్‌, స్టార్టప్‌లు వెదుకుతున్నాయని పలువురు వక్తలన్నారు.

Published : 28 Mar 2024 03:13 IST

ప్రారంభోత్సవంలో ప్రొ.యు.బి.దేశాయ్‌, సంగీత, శ్రీకాంత్‌ సిన్హా, మోహన్‌ రాయుడు, పంకజ్‌ దివాన్‌

రెడ్‌హిల్స్‌, న్యూస్‌టుడే: ఇంజినీర్లు, పట్టభద్రులు ఉద్యోగావకాశాల కోసం వెదుకుతుంటే.. మరో వైపు ప్రతిభావంతులైన నిపుణుల కోసం కార్పొరేట్‌, స్టార్టప్‌లు వెదుకుతున్నాయని పలువురు వక్తలన్నారు. దీనిని పరిష్కరించడానికే ఇండస్ట్రీ అకాడమియా కనెక్ట్‌ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. బుధవారం రెడ్‌హిల్స్‌లో తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(ఎఫ్‌టీసీసీఐ), ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీ (ఐసీటీ) ఆధ్వర్యంలో ‘ఇండస్ట్రీ, అకాడమియా కనెక్ట్‌’ను ప్రారంభించారు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌ ఎఫ్‌టీసీసీఐ ఐసీటీ కమిటీ సలహాదారు ప్రొ.యు.బి.దేశాయ్‌ మాట్లాడుతూ.. నైపుణ్యాలతో కూడిన పట్టభద్రులకు పరిశ్రమల్లో చక్కటి డిమాండ్‌ ఉందన్నారు. ఐసీటీ కమిటీ ఛైర్మన్‌ పంకజ్‌ దివాన్‌,   తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌(టాస్క్‌) సీఈఓ శ్రీకాంత్‌ సిన్హా మాట్లాడారు. కార్యక్రమంలో ఎఫ్‌టీసీసీఐ ప్రతినిధులు సంగీత, మోహన్‌రాయుడు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని