logo

కార్ల గోదాంలో మంటలు.. ఆరు వాహనాలు దగ్ధం

గండిపేట మండలం ఖానాపూర్‌ సమీపంలోని ఓ కార్ల గోదాంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో మరమ్మతులకు గురైన వాహనాలు ఆహుతయ్యాయి. నగరానికి చెందిన ఓ వ్యాపారి మరమ్మతులకు గురయిన కార్లను ఖానాపూర్‌ సమీపంలోని ఓ గోదాంలో నిల్వ ఉంచారు.

Published : 29 Mar 2024 03:35 IST

మంటలను ఆర్పివేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

నార్సింగి, న్యూస్‌టుడే: గండిపేట మండలం ఖానాపూర్‌ సమీపంలోని ఓ కార్ల గోదాంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో మరమ్మతులకు గురైన వాహనాలు ఆహుతయ్యాయి. నగరానికి చెందిన ఓ వ్యాపారి మరమ్మతులకు గురయిన కార్లను ఖానాపూర్‌ సమీపంలోని ఓ గోదాంలో నిల్వ ఉంచారు. సీఎన్జీ గ్యాస్‌తో నడిచే ఈ కార్లను సిబ్బంది ఇక్కడ మరమ్మతు చేస్తుంటారు. గురువారం మధ్యాహ్నం సిబ్బంది భోజనాలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలంటుకుని కార్లకు వ్యాపించాయి. సిబ్బంది వెంటనే ఫైర్‌స్టేషన్‌కు ఫోన్‌ చేయడంతో మాదాపూర్‌ నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్‌ఇంజిన్‌ సాయంతో మంటలార్పేశారు. కార్లకు మరమ్మతులు చేస్తుండగా గ్యాస్‌ వెల్డింగ్‌ పనిచేస్తుండగా నిప్పురవ్వలు అంటుకుని మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు. ప్రమాద సమయంలో గోదాంలో 25 వాహనాలు ఉండగా ఆరు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి తమకు ఫిర్యాదు అందలేదని గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని