logo

చిలుకూరులో ఘనంగా శ్రీదేవి, భూదేవి, బాలాజీల వివాహ మహోత్సవం

తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరు బాలాజీ వివాహ మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు భక్తకోటి భారీగా తరలివచ్చారు.

Updated : 22 Apr 2024 05:32 IST

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరు బాలాజీ వివాహ మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు భక్తకోటి భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఒకవైపు భక్తుల గోవింద నామస్మరణ.. మరోవైపు వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణోత్సవం రమణీయంగా జరిగింది. ఆదివారం రాత్రి 11 గంటలకు ప్రారంభమైన వేడుక.. సోమవారం వేకువజామువరకు కొనసాగింది. చిలుకూరు గ్రామస్థుల ఆధ్వర్యంలో పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ఎదుర్కోళ్ల కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవమూర్తులకు సూర్యప్రభ, గజవాహన సేవలు నిర్వహిస్తూ పురవీధుల్లోకి తీసుకు రాగా భక్తులు దర్శనం కోసం పోటీపడ్డారు.

కల్యాణప్రాప్తి రద్దు చేసినప్పటికీ.. గరుడ ప్రసాదం పంపిణీ వేళ జరిగిన సంఘటనల నేపథ్యంలో వివాహప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు  ఆలయ పూజారులు ప్రకటించినప్పటికీ భక్తులు మాత్రం వేలాది సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల కోసం కల్యాణం వీక్షించడానికి ఆలయ ప్రధాన ద్వారం వద్ద భారీ తెర ఏర్పాటు చేశారు.  ఆలయ మేనేజింగ్‌ కమిటీ ఛైర్మన్‌ డా.ఎంవీ సౌందరరాజన్‌, కన్వీనర్‌ గోపాలకృష్ణస్వామి, కన్నయ్యస్వామి, కిరాణాచార్యులు, రామాచార్యులు, సురేష్‌, అనిల్‌స్వామి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని