logo

ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలి

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Updated : 07 May 2024 05:53 IST

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం పౌర సరఫరాల శాఖాధికారులు, తహసీల్దార్లుతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు ముందస్తుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. గుత్తేదార్లు ధాన్యం తరలింపునకు తగిన వాహనాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ముందస్తుగా వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున కోనుగోలు కేంద్రాల్లో తగినన్ని టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో అదనపు పాలనాధికారి లింగ్యానాయక్‌, డీఆర్‌డీఓ శ్రీనివాస్‌, డీఎస్‌ రాజేశ్వర్‌, మేనేజర్‌ సుగుణాబాయి, డీసీఓ ఈశ్వరమ్మ, పాండురంగం, తహసీల్దారు లక్ష్మీనారాయణ ఉన్నారు.


ముగింపు శిక్షణ తరగతుల పరిశీలన

కొడంగల్‌: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 1 నుంచి కొడంగల్‌లో నిర్వహించిన శిక్షణ తరగతులు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌లు కలిసి శిక్షణ తరగతుల్లోని పీఓ, ఏపీఓ, ఓపీఓలతో మాట్లాడారు. 5 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఓటు వేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లెక్కింపు, వీవీప్యాడ్స్‌ లెక్కింపు తదితర అంశాల గురించి వారిని అడిగి తెలుసుకొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో మొత్తం 282 పోలింగ్‌ కేంద్రాలకుగాను 1316 మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు. వీరితో పాటు అదనంగా 230 మందిని రిజర్వులో ఉంచుతామన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల తహసీˆల్దార్‌లు, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని