logo

ఐసీఎస్‌ఈ ఫలితాల్లో రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌ ప్రభంజనం

ఐసీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాల్లో రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌ ప్రభంజనం సృష్టించింది. సోమవారం వెలువడిన ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు.  వరుసగా 17వ ఏటా శత శాతం ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది.

Published : 07 May 2024 02:08 IST

10వ తరగతిలో వరుసగా  17వ ఏటా శతశాతం ఉత్తీర్ణత

అబ్దుల్లాపూర్‌మెట్‌: ఐసీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాల్లో రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌ ప్రభంజనం సృష్టించింది. సోమవారం వెలువడిన ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు.  వరుసగా 17వ ఏటా శత శాతం ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది. రామోజీ ఫిల్మ్‌సిటీ సమీపంలోని స్కూల్‌లో ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమంలో రమాదేవి ట్రస్ట్‌ ట్రస్టీ డా.రావి చంద్రశేఖర్‌,  ప్రిన్సిపల్‌ ఖమర్‌సుల్తానా.. ఉపాధ్యాయులను, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. రావిచంద్రశేఖర్‌, ఖమర్‌సుల్తానా మాట్లాడుతూ.. పాఠశాలలో అత్యుత్తమ  బోధనతో విద్యార్థులను తీర్చిదిద్దేలా యాజమాన్యం తోడ్పాటుతో కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది రోబోటిక్‌ ల్యాబ్‌ అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

సత్తాచాటిన విద్యార్థులు.. ఈ ఏడాది 170 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాశారు.   80శాతం మార్కుల కంటే అధికంగా సాధించి 82 మంది  సత్తాచాటారు. 99 మంది  డిస్టింక్షన్‌ సాధించడం విశేషం. మిగతా వారు ఫస్ట్‌క్లాస్‌ సాధించారు. హిస్టరీ, సివిక్స్‌ సబ్జెక్టుల్లో 16 మంది నూటికి నూరు మార్కులు సాధించగా, హోంసైన్స్‌లో 8 మంది, బయాలజీలో 5 మంది, కెమిస్ట్రీలో ఒకరు నూరు శాతం మార్కులతో ఫలితాల్లో మెరిశారు.టి.వైష్ణవి ఓవరాల్‌(క్యూములేటివ్‌) 95.83 శాతం, బెస్ట్‌ ఆఫ్‌ 5 సబ్జెక్ట్స్‌లో 96.2 శాతంతో పాఠశాల టాపర్‌గా నిలిచింది. కె.తనిష్కరెడ్డి ఓవరాల్‌ 95.50 శాతం, బెస్ట్‌ ఆఫ్‌ 5 సబ్జెక్ట్స్‌లో 95.6 శాతం, వి.కార్తికేయ, అభిషేక్‌ కులకర్ణి ఓవరాల్‌ 95.17 శాతం సాధించారు. వి.కార్తికేయ, ఎం.కార్తికేయ బెస్ట్‌ ఆఫ్‌ 5 సబ్జెక్ట్స్‌లో 95.8 శాతం సాధించి ఫలితాల్లో సత్తా చాటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని