logo

కన్హా శాంతివనంలో గ్లోబల్‌ టీన్స్‌ మీట్‌ ప్రారంభం

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలోని ధ్యాన మందిరంలో గ్లోబల్‌ టీన్స్‌ మీట్‌ మంగళవారం ప్రారంభమైంది. ఈ మీట్‌లో దేశవ్యాప్తంగా వివిధ కళాశాలలకు చెందిన 500 మంది యువత ప్రత్యక్షంగా, వర్చువల్‌గా వేల మంది పాల్గొన్నారు.

Published : 08 May 2024 03:36 IST

కార్యక్రమానికి హాజరైన యువత

నందిగామ, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలోని ధ్యాన మందిరంలో గ్లోబల్‌ టీన్స్‌ మీట్‌ మంగళవారం ప్రారంభమైంది. ఈ మీట్‌లో దేశవ్యాప్తంగా వివిధ కళాశాలలకు చెందిన 500 మంది యువత ప్రత్యక్షంగా, వర్చువల్‌గా వేల మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని హార్ట్‌ఫుల్‌నెస్‌ గ్లోబల్‌గైడ్‌ కమలేష్‌ డి పటేల్‌ ప్రారంభించి మాట్లాడారు. భారతదేశం అత్యధిక యువత కలిగిన దేశమని అన్నారు. అలాంటి యువత మంచి మార్గంలో ప్రయాణించేందుకు ఇలాంటి సదస్సులు ఉపయోగపడుతాయని చెప్పారు. వారం రోజుల పాటు నిర్వహించే సదస్సులో యువత అంతర్గత పరివర్తన, నాయకత్వ శిక్షణ, కమ్యూనికేషన్‌ నైపుణ్యం, ప్రకృతికి ప్రాధాన్యం, కరుణ, సృజనాత్మకతను పెంపొందించడం, చదువుతో పాటు ధ్యానాన్ని జోడించడం, ఆధునిక పరిజ్ఞానం, సమీకృత స్వీయ దిశగా అడుగులు తదితరాలపై అవగాహన కల్పించనున్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు