logo

నూతన ఆవిష్కరణలతో ముందుకు..

డిఫెన్స్‌ టెక్నాలజీ కంపెనీ ‘కాన్‌స్టెల్లి’ 6వ వార్షికోత్సవం టీహబ్‌లో జరిగిందని ఆ సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. హై ఫిడిలిటీ, సిమ్యులేషన్‌ సొల్యూషన్స్‌లో ప్రముఖ ప్రొవైడర్‌ అయిన కాన్‌స్టెల్లి పోరాట విమానాలు, నిఘా విమానాలు, డ్రోన్‌లు, వార్‌ఫేర్‌ సిస్టమ్‌, మైక్రోవేవ్‌ పేలోడ్‌లలో ప్రోగ్రాం జాప్యాలను తగ్గించే లక్ష్యంతో పనిచేస్తోంది.

Updated : 08 May 2024 05:54 IST

ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డా.సతీష్‌రెడ్డితో సత్యగోపాల్‌, అవినాష్‌ చెన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: డిఫెన్స్‌ టెక్నాలజీ కంపెనీ ‘కాన్‌స్టెల్లి’ 6వ వార్షికోత్సవం టీహబ్‌లో జరిగిందని ఆ సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. హై ఫిడిలిటీ, సిమ్యులేషన్‌ సొల్యూషన్స్‌లో ప్రముఖ ప్రొవైడర్‌ అయిన కాన్‌స్టెల్లి పోరాట విమానాలు, నిఘా విమానాలు, డ్రోన్‌లు, వార్‌ఫేర్‌ సిస్టమ్‌, మైక్రోవేవ్‌ పేలోడ్‌లలో ప్రోగ్రాం జాప్యాలను తగ్గించే లక్ష్యంతో పనిచేస్తోంది. దేశ రక్షణ పరిశ్రమను శక్తిమంతం చేయడంతో పాటు నూతన ఆవిష్కరణలు, స్వదేశీకరణను వేగవంతం చేయడానికి కట్టుబడి ఉందని కంపెనీ వ్యవస్థాపకులు సత్యగోపాల్‌, అవినాష్‌ చెన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆవిష్కరణల్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పిందని వివరించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో కంపెనీ సహకారం ఎనలేనిదని డీఆర్‌డీవో ఈసీఎస్‌ డైరెక్టర్‌ జనరల్‌ డా.బి.కె.దాస్‌ ప్రశంసించారు. హైఫిడిలిటీ మోడలింగ్‌, సిమ్యులేషన్‌లో ప్రత్యేక పాత్ర వహించిందని ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు, డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్‌ డా.సతీష్‌రెడ్డి అన్నారు. ఈ కంపెనీకి చాలా అభివృద్ధి అవకాశాలున్నాయని పేర్కొన్నారు. స్టాన్‌ఫోర్డ్‌ జీఎస్‌బీ ఎగ్జిక్యూటివ్‌ బిజినెస్‌ కోచ్‌ మాథ్యూ వెబర్‌,  ఎన్‌ఐ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ భాస్కర్‌ సేరీ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని