logo

భారాస చేసిన అభివృద్ధి చూసి ఓటేయండి

రాష్ట్రంలో పదేళ్ల కాలంలో కేసీఆర్‌ చేసిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఓటు వేయాలని మాజీ మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల భారాస అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి, మండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, పరిగి అసెంబ్లీ ఇంఛార్జి గట్టు రాంచందర్‌రావు అన్నారు.

Published : 08 May 2024 03:44 IST

మాట్లాడుతున్న సబితారెడ్డి, వేదికపై మాజీ ఎమ్మెల్యే కొప్పులు, భారాస అభ్యర్థి కాసాని తదితరులు

న్యూస్‌టుడే, పరిగి: రాష్ట్రంలో పదేళ్ల కాలంలో కేసీఆర్‌ చేసిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఓటు వేయాలని మాజీ మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల భారాస అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి, మండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, పరిగి అసెంబ్లీ ఇంఛార్జి గట్టు రాంచందర్‌రావు అన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించి ప్రజలకు భరోసా ఇచ్చింది కేసీఆర్‌ అని పేర్కొన్నారు.

కుల్కచర్ల, న్యూస్‌టుడే: అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. కుల్కచర్ల మండల కేంద్రంలోని ఓ వేడక వేదికలో భారాసా ప్రజా ఆశీర్వాద సమావేశం జరిగింది. చేవేళ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి, మండలి మాజీ చైర్మెన్‌ స్వామీగౌడ్‌ తదితరులు పాల్గొన్నా సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కడికి వెళితే అక్కడి దేవుడిపై ఒట్టు పెట్టుకొని హామీలు ఇస్తున్నారని, దీన్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. తాను ప్రసంగిస్తున్న సమయంలోనే మూడు మార్లు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా అని ప్రజలను ప్రశ్నించారు. 

మహిళలకు అభివాదం చేస్తున్న ఆనంద్‌ భాజపా, కాంగ్రెస్‌లకు ఓటేస్తే బతుకులు ఆగం

మోమిన్‌పేట: కాంగ్రెస్‌, భాజపాలకు ఓటేస్తే మన బతుకులను మనమే ఆగం చేసుకున్న వారం అవుతామని జిల్లా భారాస అధ్యక్షుడు ఆనంద్‌ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కేసారం, దుర్గంచెరువు గ్రామాలలో భారాస మండల అధ్యక్షుడు వెంకట్‌, స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం చేసి మాట్లాడారు.

వికారాబాద్‌టౌన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌ విమర్శించారు. మంగళవారం సిద్దులూరు, గోదంగూడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆయన మాట్లాడారు. గోదంగూడ గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో విద్యుత్తు పోవడంతో ఛార్జింగ్‌ లైట్లతో ప్రచారం నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని