logo

మళ్లీ మునుపటి పరిస్థితులు పునరావృతం

తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని ఎంపీ, భారాస మహబూబ్‌నగర్‌ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు.

Published : 08 May 2024 03:44 IST

మాట్లాడుతున్న ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, చిత్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని ఎంపీ, భారాస మహబూబ్‌నగర్‌ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ అర్బన్‌ మండలం బోయపల్లి, గ్రామీణ మండలం జైనల్లీపూర్‌, లాల్యానాయక్‌ తండాల్లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన ప్రచారం చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పదేళ్ల కేసీఆర్‌ పాలనలో విద్యుత్తు కోతలు, సాగు, తాగునీటి ఇబ్బందులు లేకుండా, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టామని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదు మాసాల్లోనే ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులను తీసుకొచ్చిందన్నారు. సాగునీటి సమస్య, విద్యుత్తు కోతల వల్ల యాసంగి పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారని, కేసీఆర్‌ పాలనలో ఈ సమస్యలు ఉన్నాయా అని మన్నె శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ధాన్యానికి మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్‌ ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక సాకులు చెబుతున్నారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో భారాసను గెలిపించి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు