logo

పట్నం సునీతారెడ్డిపై సీఈఓకు ఫిర్యాదు

మల్కాజిగిరి లోక్‌సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌కు సంబంధించి వైరల్‌ అవుతున్న మార్ఫింగ్‌ వీడియోలకు కాంగ్రెస్‌ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి కారణమంటూ భాజపా నేతలు ఎన్‌.రామచందర్‌రావు, గోకుల రామారావు తదితరులు మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

Published : 08 May 2024 03:54 IST

వికాస్‌రాజ్‌కు వినతిపత్రం ఇస్తున్న రామచందర్‌రావు, భాజపా నేతలు

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: మల్కాజిగిరి లోక్‌సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌కు సంబంధించి వైరల్‌ అవుతున్న మార్ఫింగ్‌ వీడియోలకు కాంగ్రెస్‌ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి కారణమంటూ భాజపా నేతలు ఎన్‌.రామచందర్‌రావు, గోకుల రామారావు తదితరులు మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం రామచందర్‌రావు మాట్లాడుతూ.. ‘మల్కాజిగిరి ఓటర్లు డబ్బు, మద్యానికి ప్రభావితం కావచ్చు’ అని ఈటల రాజేందర్‌ చెప్పినట్లుగా వీడియోను మార్ఫింగ్‌ చేసి ఓ టీవీ ఛానల్‌, రినీష్‌రెడ్డి ట్విట్టర్‌ ఖాతాలో ప్రసారమవుతోందన్నారు. ఈటల పరువు ప్రతిష్టలు దెబ్బతీసేలా వీడియోలు వైరల్‌ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారిని కోరినట్లుగా ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు