logo

జనం పోటెత్తి.. జాతర హోరెత్తి

కాంగ్రెస్‌ కార్యకర్తల కేరింతలు.. నాయకుల హర్షాతిరేకాల నడుమ సరూర్‌నగర్‌ స్టేడియంలో గురువారం రాత్రి ఆ పార్టీ నిర్వహించిన జన జాతర సభ విజయవంతమైంది.

Published : 10 May 2024 04:05 IST

నేతలు బహూకరించిన గదతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ. చిత్రంలో సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, నాగోలు, కర్మన్‌ఘాట్‌, సరూర్‌నగర్‌: కాంగ్రెస్‌ కార్యకర్తల కేరింతలు.. నాయకుల హర్షాతిరేకాల నడుమ సరూర్‌నగర్‌ స్టేడియంలో గురువారం రాత్రి ఆ పార్టీ నిర్వహించిన జన జాతర సభ విజయవంతమైంది. పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన డంతో వేల సంఖ్యలో కార్యకర్తలు  తరలొచ్చారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు దీపా దాస్‌ మున్షీ, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డితోపాటు పాటు చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి ఎంపీ అభ్యర్థులు జి.రంజిత్‌రెడ్డి, పట్నం సునీతారెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. రాహుల్‌గాంధీకి జనం   చప్పట్లతో స్వాగతం పలికారు. తెలంగాణలో ప్రతి కుటుంబంలో ఒక మహిళకు ఏటా రూ.లక్ష బ్యాంకులో వేస్తామన్నప్పుడు హర్షం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని రాహుల్‌ తన సెల్‌ఫోనులో చిత్రీకరించారు.

తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు

  • జనజాతర సభలో ప్రధాన ద్వారం నుంచి కాకుండా అరకిలోమీటర్‌ దూరంలో వెనుక గేటు నుంచి పంపడంతో నేతలు, ప్రజలు ఇబ్బందిపడ్డారు.
  • వేదికపై చల్లానర్సింహారెడ్డి అధ్యక్షత వహించగా మధుయాస్కీగౌడ్‌, మల్‌రెడ్డి రాంరెడ్డి, రామ్మోహన్‌గౌడ్‌, భాస్కర్‌రెడ్డి, కొత్తపల్లి జైపాల్‌రెడ్డి, వజీర్‌ ప్రకాశ్‌గౌడ్‌ ఉన్నారు.
  • సభ అనంతరం కార్యకర్తలు ఒక్కసారిగా వీఐపీగేటు నుంచి దూసుకొచ్చారు. మెట్ల కోసం ఏర్పాటు చేసిన ఓ చెక్క విరిగింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. మఫ్టీలో ఉన్న పోలీసులు కార్యకర్తలను నెమ్మదిగా బయటకు పంపించారు. ఈ క్రమంలో పలువురి ఫోన్లతోపాటు బంగారు వస్తువులు చోరీకి గురయ్యాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు