logo

రుసుం చెల్లించకుంటే లైసెన్సు రద్దు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం కర్మాగారాల యాజమాన్యాలు 2022 సంవత్సరానికి సంబంధించి నిర్ణీత లైసెన్సు రుసుం ఈ నెలాఖరులోపు సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా చెల్లించాలి. చలానాను సంబంధిత కర్మాగారాల తనిఖీ అధికారి, కడప కార్యాలయానికి పంపాలని

Published : 06 Dec 2021 03:18 IST

కడప(చిన్నచౌకు), న్యూస్‌టుడే : ప్రభుత్వ నిబంధనల ప్రకారం కర్మాగారాల యాజమాన్యాలు 2022 సంవత్సరానికి సంబంధించి నిర్ణీత లైసెన్సు రుసుం ఈ నెలాఖరులోపు సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా చెల్లించాలి. చలానాను సంబంధిత కర్మాగారాల తనిఖీ అధికారి, కడప కార్యాలయానికి పంపాలని ఉప ప్రధాన కర్మాగారాల తనిఖీ అధికారి కె.కృష్ణమూర్తి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరైనా లైసెన్సు రుసుం చెల్లించి ఒరిజినల్‌ చలానాను తమ వద్దే పెట్టుకుని ఉంటే వెంటనే కర్మాగారాల తనిఖీ అధికారి కార్యాలయానికి పంపాలన్నారు. గడువు లోపు రుసుం చెల్లించకుంటే లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఏవైనా సందేహాలు ఉంటే 9295850949 నంబరును సంప్రదించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని