వివాహిత అనుమానాస్పద మృతి
సుజన (పాత చిత్రం)
ధర్మవరం, న్యూస్‌టుడే: పట్టణంలోని తొగటవీధికి చెందిన సుజన (27) అనే వివాహిత ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతి చెందినట్లు పట్టణ పోలీసులకు భర్త వెంకటకృష్ణ తెలపడంతో పోలీసులు వెళ్లి పరిశీలించారు. ప్రొద్దుటూరుకు చెందిన సుజనకు ధర్మవరానికి చెందిన వెంకటకృష్ణతో 2016లో పెళ్లి అయ్యింది. వీరికి యశ్వని, తేజస్విని ఇద్దరు కుమార్తెలు సంతానం. అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తుండేవారని, సుజన మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆమె తండ్రి కొండలు ధర్మవరం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుట్టింటి వారు అధిక సంఖ్యలో రావడంతో సంఘటనాస్థలం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ వెంకటకృష్ణ ఇంటి వద్ద బైఠాయించారు. ధర్మవరం డీఎస్పీ రమాకాంత్, పోలీసులు చేరుకొని వారికి నచ్చజెప్పారు. సమగ్ర విచారణ చేస్తామని డీఎస్పీ వారికి తెలిపారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.