logo

నేటి నుంచి రిలేనిరాహార దీక్షలు

పీఆర్సీ సాధన సమితి పిలుపునిచ్చిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లావ్యాప్తంగా బుధవారం ఉద్యోగులు ఆందోళన, మానవహార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. జిల్లా సచివాలయం ఎదుట గురువారం

Published : 27 Jan 2022 01:45 IST

కొనసాగుతున్న ఉద్యోగుల ఉద్యమం
 జిల్లావ్యాప్తంగా పెల్లుబికిన నిరసనలు


అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పిస్తున్న పీఆర్సీ సాధన సమితి నాయకులు

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, కడప గ్రామీణ: పీఆర్సీ సాధన సమితి పిలుపునిచ్చిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లావ్యాప్తంగా బుధవారం ఉద్యోగులు ఆందోళన, మానవహార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. జిల్లా సచివాలయం ఎదుట గురువారం నుంచి 30వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలకు సన్నాహాలు చేస్తున్నారు. కార్యక్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛనుదారులు, సచివాలయ, పొరుగుసేవలు, ఒప్పంద, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని పీఆర్సీ సాధన సమితి నేతలు పిలుపునిచ్చారు. ఆందోళనలో భాగంగా కడప ఆర్టీసీ బస్టాండు కూడలిలోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన కార్యక్రమంలో పాల్గొన్న పీఆర్సీ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నేతలు వెంకటజనార్దనరెడ్డి, జలీల్‌, ఖజానశాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్‌ తదితరులు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వంలో భాగమేనన్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించాలని, తమపై దుష్ప్రచారం చేయడం సరి కాదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దు చేసి పీఆర్సీ సాధన సమితి నేతలతో చర్చలు జరిపి తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్‌ అధ్యక్షుడు శ్రీనివాసులు, ఎన్జీవో సంఘ కార్యదర్శి రవికుమార్‌, ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని