logo

రైతులను గొప్ప శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దుతాం

రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించి, ప్రత్యేక శిక్షణతో పుడమి పుత్రులను గొప్ప శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటీవ్‌ వైస్‌ ఛైర్మన్‌ తల్లం విజయకుమార్‌ అన్నారు. పులివెందులకు సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ అంతర్జాతీయ

Published : 19 May 2022 03:54 IST

అధికారులతో చర్చిస్తున్న విజయకుమార్‌

పులివెందుల, న్యూస్‌టుడే : రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించి, ప్రత్యేక శిక్షణతో పుడమి పుత్రులను గొప్ప శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటీవ్‌ వైస్‌ ఛైర్మన్‌ తల్లం విజయకుమార్‌ అన్నారు. పులివెందులకు సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ అంతర్జాతీయ పశు పరిశోధన కేంద్రంలో ఇండో జర్మన్‌ గ్లోబల్‌ అకాడమీ ఆగ్రో ఎకాలజీ, లెర్నింగ్‌ పరిశోధన కేంద్రం ఏర్పాటు కోసం బుధవారం ఓఎస్డీ అనీల్‌కుమార్‌రెడ్డితో కలసి స్థల పరిశీలన చేశారు. రూ.178 కోట్ల వ్యయంతో ప్రకృతి వ్యవసాయం పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీ కార్ల్‌ సీఈవో రైతు సాధికార సంస్థ సీనియర్‌ కన్సల్‌టెంట్‌ వరప్రసాద్‌, సురేంద్రరెడ్డి, ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్‌ రామకృష్ణరాజు, డీఆర్‌డీఏ ఏరియా కో ఆర్డినేటర్‌ నీలకంఠారెడ్డి, పరిశోధన కో ఆర్డినేటర్‌ సోహైల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని