logo

రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని శనివారం స్వామివారి దర్శనానికి భక్తుల బారులు తీరారు. వివిధ ప్రాంతాల

Published : 17 Jan 2022 02:47 IST

స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు

వేములవాడ ఆలయం, న్యూస్‌టుడే : దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని శనివారం స్వామివారి దర్శనానికి భక్తుల బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో పాటు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. కల్యాణక ట్టలో తలనీలాలు సమర్పించిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పలువురు భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు వివిధ పూజ కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. గండా దీపంలో నూనె పోసి గండాలు తొలగాని వేడుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షణ చేశారు. ఆదివారం ఆరుద్ర నక్షత్రోత్సవం సందర్భంగా రాజన్న ఆలయ గర్భగుడిలో స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలను ఆయల అర్చకులు ఘనంగా నిర్వహించారు. దాదాపు 10 వేలకు పైగా మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని