logo

కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా గవర్నర్లు

కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా మారిన గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 26 Nov 2022 05:26 IST

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి

సమావేశంలో మాట్లాడుతున్న వెంకట్‌రెడ్డి

పెద్దపల్లి, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా మారిన గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పెద్దపల్లిలో శుక్రవారం జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పాలనలో గవర్నర్ల జోక్యం పెరిగిందని ఆరోపించారు. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, దిల్లీల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉందని, కేరళలో అయితే ఓ మంత్రినే తొలగించమని గవర్నర్‌ డిమాండ్‌ చేస్తున్నారని చెప్పారు. భాజపా ఫాసిస్టు ధోరణికి వ్యతిరేకంగా ప్రగతిశీల వామపక్ష లౌకిక శక్తుల ఏకీకృతానికి సీపీఐ ప్రయత్నిస్తోందని చెప్పారు. భాజపాను నిలువరించేందుకే మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాసతో కలిసి పని చేశామన్నారు. ప్రతిపక్ష పార్టీలపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులతో మోదీ ప్రభుత్వం బెదిరిస్తోందని, దీంతో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కలవేన శంకర్‌, తాండ్ర సదానందం, గోశిక మోహన్‌, కనకరాజ్‌, మల్లయ్య, స్వామి, ఓదెమ్మ, సునిల్‌, ప్రకాష్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని