logo

మావోయిస్టు మిలిటెంటు అరెస్టు

పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యాన్ని దళం వద్దకు తరలిస్తున్న మావోయిస్టు మిలిటెంటును ములుగు జిల్లా తాడ్వాయి మండల పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

Published : 06 Dec 2022 03:18 IST

పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం

నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న సుధీర్‌ రామ్‌నాథ్‌ కేకన్‌

ములుగు, న్యూస్‌టుడే : పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యాన్ని దళం వద్దకు తరలిస్తున్న మావోయిస్టు మిలిటెంటును ములుగు జిల్లా తాడ్వాయి మండల పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ములుగు ఏఎస్పీ సుధీర్‌ రామ్‌నాథ్‌ కేకన్‌ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌ మండలం పెద్దరాతపల్లికి చెందిన కుంట లింగయ్య గతంలో మావోయిస్టు దళానికి మిలిటెంట్‌గా పని చేశాడు. తన వ్యక్తిగత అవసరాల కోసం ఇటీవల పార్టీని సంప్రదించాడు. మావోయిస్టు అగ్రనేత కంకనాల రాజిరెడ్డి ఆదేశాల మేరకు మందుగుండు సామగ్రి, సాహిత్యాన్ని దళానికి అప్పగించేందుకు తన స్వగ్రామం నుంచి సోమవారం తాడ్వాయికి చేరుకున్నాడు. పీఎల్‌జీఏ వారోత్సవాల్లో భాగంగా తాడ్వాయి ఎస్‌ఐ తన బలగాలతో తనిఖీలు నిర్వహిస్తుండగా.. బస్టాండు సమీపంలో అనుమానాస్పదంగా కనిపించాడు. అదుపులోకి తీసుకుని విచారించగా.. అతని వద్ద జిలెటిన్‌ స్టిక్స్‌- 5, డిటొనేటర్స్‌-3, విప్లవ సాహిత్యం లభ్యమైనట్లు వివరించారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని