logo

సుగుణాభిరాముడి కల్యాణోత్సవ సందడి

 జిల్లాలో సీతారాముల కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. స్థానిక హెలిప్యాడ్‌ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం మేయర్‌ సునీల్‌రావు ఆధ్వర్యంలో రాముడికి నామకరణం, ఎదుర్కోలు ఉత్సవం చేపట్టారు.

Updated : 30 Mar 2023 07:08 IST

గంజ్‌ వరసిద్ధి వినాయక ఆలయంలో సీతమ్మ తల్లికి అభిషేకాలు

కరీంనగర్‌ సాంస్కృతికం, జమ్మికుంట:  జిల్లాలో సీతారాముల కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. స్థానిక హెలిప్యాడ్‌ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం మేయర్‌ సునీల్‌రావు ఆధ్వర్యంలో రాముడికి నామకరణం, ఎదుర్కోలు ఉత్సవం చేపట్టారు. సప్తగిరికాలనీలోని కోదండ రామాలయం వారు ఎదుర్కోలు నిర్వహించారు.  ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ మండపంలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే సీతారాముల కల్యాణానికి అధికాôసుగుణాభిరాముడి కల్యాణోత్సవ సందడిలు సర్వం సిద్ధం చేశారు. స్వామివారి కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించనుండగా కొండగట్టు, ధర్మపురి దేవాలయాల నుంచి పట్టువస్త్రాలు, తలంబ్రాలను బుధవారం పంపించారు. శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి సీతారాముల రక్షాబంధనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవమూర్తులను అలంకరించి పూజలు చేశారు. జమ్మికుంట రామాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి దేవాలయ అర్చకులు వెంకటాచార్యులు ఆధ్వర్యంలో దేవతా ఆహ్వానం, బేరీ అర్చనలు నిర్వహించారు. సీతారాముల కల్యాణం సందర్భంగా ఎదురుకోళ్లు నిర్వహించారు.  

కరీంనగర్‌ సాంస్కృతికం: సీతమ్మ దేవి జన్మదినం పురస్కరించుకొని కరీంనగర్‌ వరసిద్ధి వినాయక ఆలయంలో సీతమ్మ జన్మాష్టమిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని