మరిన్ని విజయాలు సాధిద్దాం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతి స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గుచూపాలి
రైతు దినోత్సవంలో మాట్లాడుతున్న కలెక్టర్ అనురాగ్ జయంతి
సిరిసిల్ల గ్రామీణం, తంగళ్లపల్లి, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతి స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు దినోత్సవాన్ని సిరిసిల్ల పట్టణ పరిధిలోని చంద్రంపేట, బోనాల, తంగళ్ల్లపల్లి మండల కేంద్రంతోపాటు, బద్దెనపల్లి గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. వ్యవసాయశాఖ ముద్రించిన మన తెలంగాణ దేశానికి అన్నపూర్ణ, పంటలను నెల ముందస్తుగా సాగు చేద్దాం అనే కరపత్రాలను ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించి రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సహకార విద్యుత్తు సరఫరా సంఘం (సెస్) ఛైర్మన్ చిక్కాల రామారావు, ఎంపీపీ పడిగెల మానస, తహసీల్దార్ సదానందం, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
* సిరిసిల్ల పట్టణ పరిధిలోని బోనాల, చంద్రంపేట రైతు వేదికల్లో జిల్లా రైతు బంధు సమితి(రైబస) అధ్యక్షుడు గడ్డం నర్సయ్య ఆధ్వర్యంలో రైతు దినోత్సవం వైభవంగా నిర్వహించారు. ర్యాలీగా రైతు వేదికల వద్దకు తరలివచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ మరమగ్గాలు, జౌళి అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గూడూరి ప్రవీణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఆకునూరి శంకరయ్య, మున్సిపల్ ఛైర్‌పర్సన్ జిందం కళ, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లకు ప్రత్యేక డ్రైవ్
ఎల్లారెడ్డిపేట: వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, జిల్లాలో 57 క్లస్టర్లలో రైతు వేదికలను నిర్మించి ఏఈవోలను నియమించిందని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి, రాచర్ల బొప్పాపూర్, అల్మాస్‌పూర్, వెంకటాపూర్ క్లస్టర్లలో శనివారం రైతు దినోత్సవం నిర్వహించారు. ఆదర్శ రైతులు, ఆయిల్‌పాం సాగు చేస్తున్న రైతులను సన్మానించారు. రాచర్ల గొల్లపల్లి క్లస్టర్ రైతు వేదికలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సీజన్‌లో జిల్లాలో 1.8 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారని తెలిపారు. 2.5 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఆయిల్‌పాం సాగుపై రైతులు దృష్టిసారించాలని, మొక్కలు, బిందు సేద్యం పరికరాలను రాయితీపై అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, రెండు మూడు రోజుల్లో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. జడ్పీటీసీ సభ్యుడు లక్ష్మణ్‌రావు, ఎంపీపీ పిల్లి రేణుక, వైస్ ఎంపీపీ భాస్కర్, తహసీల్దారు జయంత్‌కుమార్, ఎంపీడీఓ చిరంజీవి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, రైతు బంధు సమితి అధ్యక్షులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Visakhapatnam: విశాఖలో తెదేపా మెరుపు నిరసన
-
Rahul Gandhi: బిలాస్పూర్ To రాయ్‌పూర్.. ట్రైన్లో ప్రయాణించిన రాహుల్
-
Singer Damini: బయటకు వెళ్తే నా పరిస్థితేంటో అర్థం కావటం లేదు: దామిని
-
Chandrababu Arrest: తెదేపా ఓ కుటుంబం.. కార్యర్తలు మా బిడ్డలు: భువనేశ్వరి
-
King Of Kotha OTT Release: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త చిత్రం.. ఆ విషయంలో నో క్లారిటీ..!
-
Demat accounts: ఊరిస్తున్న మార్కెట్లు.. పెరిగిన డీమ్యాట్ ఖాతాలు