logo

ఈసీ మార్గదర్శకాలపై అవగాహన అవసరం

ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలపై సూక్ష్మ పరిశీలకులకు (మైక్రో అబ్జర్వర్ల)కు పూర్తి అవగాహన ఉండాలని, ఎన్నికల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి పేర్కొన్నారు.

Published : 04 May 2024 04:33 IST

కరీంనగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలపై సూక్ష్మ పరిశీలకులకు (మైక్రో అబ్జర్వర్ల)కు పూర్తి అవగాహన ఉండాలని, ఎన్నికల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి పేర్కొన్నారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌ పమేలా సత్పతి, ఎన్నికల పరిశీలకులు అమిత్‌ కటారియాతో కలిసి హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. పోలింగ్‌ ప్రారంభం నుంచి ఈవీఎంలు స్ట్రాంగ్‌ రూములకు చేరే వరకు జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలన్నారు.  ఎన్నికల సాధారణ పరిశీలకులు అమిత్‌ కటారియా మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్‌, ఎల్‌డీఎం ఆంజనేయులు, అధికారులు పాల్గొన్నారు.


కరీంనగర్‌ కలెక్టరేట్‌ : పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునే ప్రక్రియను అప్రమత్తంగా నిర్వహించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి సూచించారు. శుక్రవారం కరీంనగర్‌ సెయింట్‌ అల్ఫోన్స్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓటర్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ఎన్నికల సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌దేశాయ్‌, శిక్షణ కలెక్టర్‌ అజయ్‌యాదవ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.


రెండో దశ యాదృచ్ఛికీకరణ

కరీంనగర్‌ కలెక్టరేట్‌ : పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు చేపడుతున్నామని కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో ఈవీఎంలు, వీవీ ప్యాట్లు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రెండో దశ యాదృచ్ఛికీకరణ ప్రక్రియ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎన్నికల సాధారణ పరిశీలకులు అమిత్‌ కటారియా పర్యవేక్షణలో జరిగింది. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎండలను దృష్టిలో ఉంచుకొని పోలింగ్‌ కేంద్రాల్లో వైద్య బృందం, టెంట్లు, గ్రీన్‌ కార్పెట్‌, తాగునీరు తదితర ఏర్పాట్లు చేపడతామని ప్రకటించారు. కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, కరీంనగర్‌, సిరిసిల్ల అదనపు కలెక్టర్లు ప్రఫుల్‌దేశాయ్‌, పూజారి గౌతమి, శిక్షణ కలెక్టర్‌ అజయ్‌యాదవ్‌, పార్టీల నేతలు మడుపు మోహన్‌, కొమురయ్య, బండ రమణారెడ్డి, నాంపెల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని