logo

దేవుళ్ల పేరుతో రాజకీయాలు వద్దు: వినోద్‌

కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీని తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నిలిపిన తాను ఎంపీగా గెలిచాక నగర రూపురేఖలను మరింతగా మార్చేందుకు కృషి చేయనున్నట్లు భారాస ఎంపీ అభ్యర్థి బోయిపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు.

Published : 05 May 2024 04:37 IST

మాట్లాడుతున్న భారాస అభ్యర్థి, పక్కన ఎమ్మెల్యే కమలాకర్‌

రాంపూర్‌ (కరీంనగర్‌), రామడుగు, గంగాధర: కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీని తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నిలిపిన తాను ఎంపీగా గెలిచాక నగర రూపురేఖలను మరింతగా మార్చేందుకు కృషి చేయనున్నట్లు భారాస ఎంపీ అభ్యర్థి బోయిపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు. ప్రచారంలో భాగంగా శనివారం భగత్‌నగర్‌ చౌరస్తాలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి మాట్లాడారు. ఇప్పటికే అనేక పనులు జరిగాయని.. భారాస గెలిస్తే మరిన్ని అభివృద్ధి పనులు జరుగుతాయని వివరించారు. దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. కాంగ్రెస్‌ అసమర్థతోనే రాష్ట్రంలో కరువు ఏర్పడిందని, చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కలిసి తెలంగాణను తిరిగి ఆంధ్రలో కలిపే కుట్ర చేస్తున్నారన్నారు. మరో వైపు నదుల అనుసంధానం పేరుతో కేంద్రం కుట్రపన్నుతుందని చెప్పారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ ఈ ఎన్నికలు కీలకమని, ఇందులో భారాస అఖండ విజయం సాధిస్తుందన్నారు. మేయర్‌ వై.సునీల్‌ రావు, భారాస నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, పలువురు భారాస కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు, స్థానికులు హాజరయ్యారు. వినోద్‌కుమార్‌ గోపాల్‌రావుపేట రోడ్‌షోలో ప్రసంగించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించటానికి భారాసకు మద్దతు పలకాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వనరులను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. పార్లమెంటులో ఆన్యాయాన్ని ప్రశ్నించే గళం భారాసకు మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలో నలుగురు భాజపా ఎంపీలున్నా కొత్తగా ఒక్క నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేయలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, రామడుగు సింగిల్‌విండో ఛైర్మన్‌ వెంకటేశ్వర్‌రావు, నాయకులు పాల్గొన్నారు. గంగాధరలో మాట్లాడుతూ భాజపా, కాంగ్రెస్‌లను నమ్మి మరోసారి మోసపోవద్దని వివరించారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ ఎంపీగా వినోద్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, భారాస జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఇన్‌ఛార్జి భూపతిరెడ్డి, ఎంపీపీ శ్రీరాం మధుకర్‌, మండలాధ్యక్షుడు నవీన్‌రావు, సింగిల్విండో అధ్యక్షుడు బాలగౌడ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు