logo

జగిత్యాలలో నేడు కేసీఆర్‌ రోడ్‌షో

భారాస అధినేత కేసీఆర్‌ ఆదివారం సాయంత్రం జగిత్యాల జిల్లా కేంద్రంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతబస్టాండ్‌ నుంచి కొత్తబస్టాండ్‌ వరకు రోడ్‌షో నిర్వహిస్తారు.

Published : 05 May 2024 04:42 IST

రోడ్‌షో ప్రదేశాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ తదితరులు

జగిత్యాల, న్యూస్‌టుడే: భారాస అధినేత కేసీఆర్‌ ఆదివారం సాయంత్రం జగిత్యాల జిల్లా కేంద్రంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతబస్టాండ్‌ నుంచి కొత్తబస్టాండ్‌ వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. నిజామాబాద్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ తరఫున ప్రచారం నిర్వహిస్తారు. పాతబస్టాండ్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. శనివారం సాయంత్రం భారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి రోడ్‌షో మార్గాన్ని పరిశీలించారు. సభ జరిగే ప్రదేశంలో పార్టీ నేతలకు సూచనలు ఇచ్చారు. రోడ్‌షో అనంతరం కేసీఆర్‌ రాత్రి జగిత్యాలలోనే బస చేస్తారు. 

కాంగ్రెస్‌, భాజపాలు కుమ్మక్కు

జగిత్యాల: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ భాజపాలు కుమ్మక్కయ్యాయని భారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం జగిత్యాలలో ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. కేసీఆర్‌ బస్సుయాత్ర విజయవంతం కావడంతో ఆరెండు పార్టీలు ఆందోళన చెందుతున్నాయని ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే 12 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామన్నారు. వ్యవసాయరంగాన్ని కేసీఆర్‌ పండగ చేస్తే అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌ ప్రభుత్వం దండగ చేసిందన్నారు. ప్రజలు భారాస కాంగ్రెస్‌ పాలనలో తేడాను గమనిస్తున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. పసుపుబోర్డు పేరుతో బాండ్‌ పేపర్‌ రాసిచ్చి ఎంపీగా గెలిచిన అర్వింద్‌ ప్రజలను మోసం చేశాడని కాంగ్రెస్‌, భాజపాలకు ఎన్నికల్లో గుణపాఠం తప్పదని రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మార్క్‌ఫెడ్‌ మాజీ ఛైర్మన్‌ లోక బాపురెడ్డి, రాయికల్‌ పురపాలక ఛైర్మన్‌ మోర హన్మాండ్లు, జిల్లా బ్యాంకు డైరెక్టర్‌ ముప్పాల రాంచందర్‌రావు, భారాస పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని