logo

ఓటు హక్కు వినియోగంలో గోప్యత పాటించాలి

ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగంలో గోప్యత పాటించాలని పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య తెలిపారు. శనివారం పలుప్రాంతాల్లో జరుగుతున్న ఇంటివద్ద ఓటింగ్‌ను పరిశీలించారు.

Published : 05 May 2024 04:44 IST

మంథనిలో ఓటరు సహాయ కేంద్రాన్ని పరిశీస్తున్న ఆర్డీవో హనుమానాయక్‌

పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగంలో గోప్యత పాటించాలని పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య తెలిపారు. శనివారం పలుప్రాంతాల్లో జరుగుతున్న ఇంటివద్ద ఓటింగ్‌ను పరిశీలించారు. నియోజకవర్గంలో 12 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తొలిరోజు 219 మంది దివ్యాంగులు, వృద్ధులు ఇంటి వద్ద ఓటేశారని, పెద్దపల్లి రిటర్నింగ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో 67 మంది తపాలా ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. ఆదివారం కూడా ఓటింగ్‌ ప్రక్రియ ఉంటుందని తెలిపారు.

మంథని, న్యూస్‌టుడే : మంథని అసెంబ్లీ సెగ్మెంట్‌లో శనివారం 32 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంటి వద్ద నుంచి 86 మంది వృద్ధులు ఓటేశారు. మంథని సెగ్మెంట్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ 1245 మందికి 32 మంది, ఇంటి వద్ద ఓటింగ్‌కు 93 మందికి 86 మంది, అయిదుగురు సర్వీసు ఓటర్లకు ముగ్గురు ఓట్లు వేశారని ఆర్డీవో హనుమానాయక్‌ పేర్కొన్నారు. ఆదివారం సెలవు రోజున కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వేయవచ్చని, ఈ నెల 8వ తేదీతో గడువు ముగుస్తుందన్నారు.

ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి

పెద్దపల్లి, న్యూస్‌టుడే : ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆర్డీవో గంగయ్య పేర్కొన్నారు. పెద్దపల్లి మున్సిపల్‌ ఆధ్వర్యంలో శనివారం ఓటరు అవగాహన ర్యాలీని నిర్వహించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలందరూ ఓటు వేసి, అత్యధిక ఓటింగ్‌ శాతాన్ని నమోదు చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని