logo

పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్‌

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల కమిషనింగ్‌ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి సూచించారు.

Published : 07 May 2024 02:39 IST

వివరాలు అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్‌ పమేలా సత్పతి
కరీంనగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల కమిషనింగ్‌ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి సూచించారు. సోమవారం కరీంనగర్‌లోని ఎస్సారార్‌ డిగ్రీ కళాశాలలో కరీంనగర్‌, చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి, పాలిటెక్నిక్‌ కళాశాలలో మానకొండూర్‌ నియోజకవర్గానికి చెందిన ఈవీఎం కమిషనింగ్‌ను కలెక్టర్‌ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు ప్రఫుల్‌దేశాయ్‌, లక్ష్మీకిరణ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవీఎంల్లో సిబ్బంది నిర్వహిస్తున్న కమిషనింగ్‌, బ్యాలెట్‌ పత్రాల ఏర్పాట్లు, వీవీ ప్యాట్లలో సింబల్‌ లోడింగ్‌ పూర్తి వివరాలు కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కమిషనింగ్‌ పూర్తయిన అనంతరం ఒకటికి రెండు సార్లు మాక్‌ పోలింగ్‌ నిర్వహించాలన్నారు. ఈవీఎంలు సరిగా పని చేస్తున్నాయో లేదో చూసుకోవాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్‌ అజయ్‌యాదవ్‌, ఆర్డీవో మహేశ్వర్‌, తహసీల్లార్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని