logo

పనితీరు బేరీజు వేయండి

కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలో కాంగ్రెస్‌ నేతలు అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తున్నారని భాజపా జతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ అన్నారు.

Published : 08 May 2024 04:59 IST

కోర్టు వద్ద బార్‌ అసోసియేషన్‌ నాయకులు, న్యాయవాదులతో బండి సంజయ్‌

తెలంగాణచౌక్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలో కాంగ్రెస్‌ నేతలు అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తున్నారని భాజపా జతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ అన్నారు. మంగళవారం కరీంనగర్‌లో ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘కరీంనగర్‌లో పోటీ చేస్తున్న మూడు పార్టీల అభ్యర్థులను బేరీజు వేయండి. నాది ప్రజా పోరాటం.. వాళ్లది అవినీతితో ఆస్తులు పోగేసుకునే ఆరాటం. ఎవరు ఓటు విలువను పెంచి దేశవ్యాప్తంగా కరీంనగర్‌ ప్రజలకు గౌరవాన్ని తీసుకొచ్చారో ఆలోచించి తీర్పు ఇవ్వాలి. కరీంనగర్‌లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌, భారాస అభ్యర్థులు ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించలేదు. ఎప్పుడు ప్రజలను కలిసిన దాఖలాలు లేవు. కరీంనగర్‌లో నన్ను ఓడించేందుకు కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారు.’’ అని తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి,  గుగ్గిళ్లపు రమేశ్‌ పాల్గొన్నారు.

మీ సహకారంతోనే అలుపెరగని పోరాటం: కరీంనగర్‌ బార్‌ అసోసియేషన్‌ నాయకుల సహకారంతోనే అలుపెరగని పోరాటాలు చేశానని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌ జిల్లా కోర్టు వద్ద బార్‌ అసోసియేషన్‌ నాయకులను కలిశారు. బార్‌ అసోసియేషన్‌ నాయకులతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.  అనంతరం న్యాయవాదులు బండి సంజయ్‌ని శాలువాతో సత్కరించారు.

కార్పొరేటర్ల చేరిక..: తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌) : కరీంనగర్‌ నగర పాలక సంస్థ పరిధిలోని 46వ డివిజన్‌ కార్పొరేటర్‌ వంగల శ్రీదేవి పవన్‌కుమార్‌, 50వ డివిజన్‌ కార్పొరేటర్‌ కొలిపాక అంజయ్య,  జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎడ్ల శ్రీనివాస్‌, 47వ డివిజన్‌ భారాస అధ్యక్షురాలు అన్నపూర్ణతోపాటు కొందరు మంగళవారం కరీంనగర్‌లో ఎంపీ బండి సంజయ్‌ సమక్షంలో భాజపాలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని